Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా ఈసిసిఈ అన్యువల్ డే సెలబ్రేషన్స్

0

జగిత్యాల,
జగిత్యాల రూరల్ మండలం టిఆర్ నగర్, సారంగాపూర్ మండలం  రెచపెళ్ళి సెక్టార్  లోని నాగునూర్ అంగన్వాడి కేంద్రాలలో ప్రీస్కూల్  
ఈసిసిఈ అన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడియస్ సూపర్వైజర్ లు లావణ్య ,శైలజ లు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నిండిన పిల్లలందరినీ  తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే ప్రీ స్కూల్ కార్యక్రమాలకు హాజరు అయ్యేలా చూడాలని మరియు ప్రైవేట్ స్కూల్ కంటే కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలలో కూడా ప్రీ స్కూల్ పిల్లల యొక్క సిలబస్ బుక్స్ డిపార్ట్మెంట్ వారు అందించడం జరిగిందని 3+ పిల్లలకు ఎల్కేజీ  బుక్స్ మరియు 4+ పిల్లలకు  యూకేజీ బుక్స్ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని 3+ మరియు 4+ పిల్లలను ప్రతి సంవత్సరం జూలై ,డిసెంబర్, ఏప్రిల్ నెలలో పిల్లల శారీరక,  మేధో వికాసము, భాష ,నేర్చుకునే రీతులు, బడికి సంసిద్ధత వంటి అభివృద్ధి అంశాలపై తల్లులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలు అభివృద్ధి పరిధిలోని అంశాలను ఎంతవరకు చేరుకోగలిగారు అని వివరిస్తూ సంబంధిత అభివృద్ధి కార్డును తల్లులకు అందించడం జరిగింది. యన్వల్దే సెలబ్రేషన్స్ లో ప్రతిభ కనబరిచిన పిల్లలకు బ హుమతులను ముఖ్య అతిథులు అందించారు.  ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ వనిత, రజిత, వసంత , సుమిత ,జమున, ఏఎన్ఎం లు పద్మా,శ్యామల, ఆయాలు,ప్రీస్కూల్ పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie