కడప: కడప జిల్లా మైదుకూరు జాతీయ రహదారి రావుల పల్లి క్రాస్ వద్ద ఎన్ఫోర్స్ మెంట్, డిస్త్రిక్ టాస్క్ ఫోర్స్ సంయుక్త వాహనాల తనిఖీలు జరిపారు. అక్రమంగా కారు లో తరలిస్తున్న బ్రహ్మంగారి మఠం కు చెందిన ఇండ్ల నిత్య శివరాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. నిందితుడినుంచి 8 లక్షల విలువ గల వివిధ రకాల మద్యం బాటిళ్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కో ఆపరేటివ్ కాలనీ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ లో ఈసమాచారం జిల్లా అదనపు ఎస్పీ తుషార్ డూడి, ఎన్ఫోర్స్ మెంట్ సుపర్నెంట్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ విజయ్ శేకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ చెంచు బాబు, టాస్క్ ఫోర్స్ సీఐ పురుషోత్తం, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో సీఐ విశ్వనాథ రెడ్డి, సిబ్బంది పాల్గోన్నారు.