Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు ప్రారంభం….

0

ఖమ్మం: ఖమ్మం జిల్లా  ఏన్కూర్  మండల కేంద్రంలో  సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి   తుమ్మల నాగేశ్వరావు,ఎమ్మెల్యే మాలోత్  రాందాస్ నాయక్ పరిశీలించారు. రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని ఆగస్టు నెల 15 నాటికి ప్రాజెక్టు ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.ఏన్కూర్ మండలంలో కొనసాగుతున్న  సీతారామ మెయిన్ కెనాల్ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా  ప్రాజెక్ట్ నాలుగు పంప్ హౌస్ లు తో పాటు మేజర్ పనులని పూర్తయినయని  సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్ కు నీరు తరలించి   సాగర్ నుంచి వైరా ప్రాజెక్టు తరలింఇస్తామన్నారు. తద్వారా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు భూములకు ఈ సంవత్సరం నుంచే నీరు అందిస్తామని అన్నారు.మనకు కృష్ణా జలాలు రాకపోయినా గోదావరి జలాల ద్వారా కృష్ణ ఆయకట్టు క్రింద పంటలకు పండించుకోవడం పాటు వైరా ప్రాజెక్టు ద్వారా త్రాగునీరుతోపాటు ప్రాజెక్ట్ కింద ఉన్న సాగు భూములకు నీరు అందిస్తామన్నారు. అలాగే మధిర, సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని భూములకు లంకా సాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని, ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నేను  ముఖ్యమంత్రి చెప్పమన్నారు.దానికి స్పందించి త్వరగా పూర్తి చేయాలని  సీఎం చెప్పారని వారి సూచనలు మేరకు పనులు మొదలు పెట్టామని అన్నారు. రైతులకు కొంత  ఇబ్బంది జరిగిన వారికి నేను ఎమ్మెల్యే కలిసి న్యాయం చేయడం జరిగిందని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie