విజయవాడ
అగ్రిగోల్డ్ ఖాతాదారుల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజయ వాడలో తలపెట్టిన ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీ సులు ప్రకటించారు. విజయవాడ లో ఆంక్షలు ఉన్నం దున ఎలాంటి ఆందోళ నలకు అనుమతి లేదని స్పష్టం చేశా రు.అగ్రిగోల్డ్ వ్యవహారంలో నష్టపోయి న ఖాతా దారులు ఏజెంట్లను ప్రభు త్వం ఆదుకోవాలంటూ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలపై ప్రభు త్వం ఆంక్షలు విధించింది. ఇటీవల అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే 900కోట్లకు పైగా ఖాతా దారులకు చెల్లించింది.అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సమీకరించా లనే ప్రయత్నాలకు రకరకాల అటంకా లు ఎదురవుతున్నాయి. ఈ క్రమం లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు.