Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అన్నవరం దేవస్థానం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

0

విజయవాడ                                                                                                                                                          అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తరఫున ఆలయ ఈవో, శరన్నవరాత్రుల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్.. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకృత అమ్మవారికి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించి.. అమ్మవారిని దర్శించుకున్నారు.  అంతరాలయంలో దర్శనం అనంతరం అన్నవరం దేవస్థానం ప్రతినిధుల బృందానికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు ఆజాద్ తెలిపారు. ఈ విశేష కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కె.ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie