Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అన్నింటా కూటమిదే పై చేయి….

0

తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నుకలిసిన నియోజకవర్గ కూటమి నాయకులు పట్టణం లేదు పల్లె లేదు వార్డు లేదు అన్ని ప్రాంతాల్లోనూ కూటమి  తన హవా చాటుకుందని  కూటమి నాయకులు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసును గురువారం నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలం లోని గ్రామాలకు చెందిన కూటమి నాయకులు విడివిడిగా బొలిశెట్టితో సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో, వార్డుల్లో కూటమి హవాను  విశ్లేషించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ  కూటమి తరుపున తిరిగిన నాయకులతోపాటు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని తరిమికొట్టేందుకు కసిగా పని చేశారని. జగన్ మరోసారి అధికారం చేపడితే  రాష్ట్రానికి కలిగే ప్రమాదాన్ని అంతా గుర్తించారన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించడం ఖాయమని నరేంద్ర మోడీ ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు విజన్, పవన్ కళ్యాణ్ నిబద్దత అన్నీ కలిపి  రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్లడం ఖాయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie