Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

0

తిరుపతి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆచార్యగా తిప్పాచార్యులు సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో రమేష్,, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ వెంక‌ట‌శివ,త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie