Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో చెక్ పోస్ట్ ల ఏర్పాటు

సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ గండి హన్మండ్లు చెక్పోస్ట్ ను ప్రారంభించిన ఎస్పీ భాస్కర్

0

జగిత్యాల,

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మద్యం,డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో  పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని. జిల్లాలోని చుట్టూ ఉన్న అన్ని బార్డర్లలో 7 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు.
 బుధవారం నూతనంగా నిర్మించిన గండి హన్మండ్లు, ఓబులాపూర్ చెక్ పోస్ట్లను ఎస్పీ ప్రారంభించారు. రాత్రి పగలు ఇతర జిల్లాల నుండి వచ్చే ,వెళ్లే వాహనాలు  క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు.

డబ్బు మద్యం రవాణా జరగకుండా నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్ పోస్ట్ లు ప్రత్యేక గదులతో నిర్మించడం జరిగిందని ఇందులో సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తారని వచ్చి పోయే వాహనాలను, అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు.శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలక్షన్ సమయంలో ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పట్లు చేస్తుంది అన్నారు. ప్రజలు,యువత ఎలక్షన్ సమయం లో ఎలాంటి గొడవలకు పోకుండా పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటిస్తూ  వాహనాల తనిఖీలకు  ప్రజలు సహకరించాలని ఎస్పీ భాస్కర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మెట్పల్లి డిఎస్పి రవీంద్రరెడ్డి, సి.ఐ లక్ష్మీనారాయణ ఎస్.ఐలు ఉమాసాగర్, చిరంజీవి, నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie