Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆదర్శ ఉద్యోగులకు అభినందించిన ఆర్టీసీ ఎండీ

0

నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు ముఖ్యఅతిధిగా హాజరయారు. ఏపీఎస్ఆర్ టి సీకి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఎండి సి హెచ్ డి తిరుమల రావు. విజయదశమికి 5500 స్పెషల్ బస్సులు నడుపుతున్నామని,గతంలో విజయదశమికి మంచి రెవెన్యూ వచ్చేదని,గతంలో టికెట్ రేట్ కన్నా 50 శాతం అదనంగా వసూలు చేసేవాళ్లమని అన్నారు. ఇప్పుడు చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తున్నామని, దీన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 1000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రతిపాదనలు పెట్టామని,అవి కూడా త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఉద్యో గస్తులు ప్రభుత్వంలో విలీనమైనా బస్సులు సంస్థ ఆధీనంలోనే నడుపుతున్నామని తెలిపారు.గతంలో ప్రమాద బీమా 40 లక్షలు ఉంటే ఇప్పుడు కోటి పది లక్షల చేస్తున్నట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie