Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇజ్రాయిల్ మీద‌కు సుమారు 5 వేల రాకెట్ల‌ ప్ర‌యోగం

0

గాజా అక్టోబర్ 7
ఇజ్రాయిల్ మీద‌కు సుమారు 5 వేల రాకెట్ల‌ను ప్ర‌యోగించిన‌ట్లు హ‌మాస్ గ్రూపు తెలిపింది. ఆ దేశంపై ఆప‌రేష‌న్ అల్ అక్సా ఫ్ల‌డ్ చేప‌ట్టినట్లు హ‌మాస్ వెల్ల‌డించింది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ న‌గ‌రాల దిశ‌గా కేవ‌లం తొలి 20 నిమిషాల్లోనే దాదాపు 5 వేల రాకెట్ల‌ను ఫైర్ చేసిన‌ట్లు హమాస్ వెల్ల‌డించింది. సుమారు రెండు గంట‌ల పాటు ఆ ఫైరింగ్ ఏక‌ధాటిగా కొన‌సాగిన‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణ బోర్డ‌ర్ వ‌ద్ద హ‌మాస్ విధ్వంసానికి దిగ‌డంతో.. ఇజ్రాయిల్ అప్ర‌మ‌త్త‌మైంది. యుద్ధాన్ని ప్ర‌క‌టిస్తూ ర‌ణ‌గ‌ర్జ‌న చేసింది. హ‌మాస్ మిలిటెంట్లు చొర‌బ‌డిన ప్రాంతాల్లో ఐడీఎఫ్ ద‌ళాలు రంగంలోకి దిగాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie