ఈజిప్టు యుద్ధ విమానాలకు ఐఏఎఫ్ ఐఎల్-78 ట్యాంకర్‌తో రీఫుయలింగ్..
పోర్ట్ అలెగ్జాండ్రియా సెప్టెంబర్ 12
భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్-78 ట్యాంకర్.. ఈజిప్టు వైమానిక దళానికి చెందిన మిగ్29 ఎం, రాఫేల్ యుద్ధ విమానాలకు ఫుయలింగ్ చేసింది. ఎక్స్ బ్రైట్ స్టార్ 23 పేరుతో ఈజిప్టులో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. సుమారు 34 దేశాలకు చెందిన త్రివిధ దళాలు ఆ విన్యాసాల్లో తమ సత్తా చూపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ భారతీయ వైమానిక దళానికి చెందిన ఐఎల్-78 ట్యాంకర్ తన విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈజిప్టు సైన్యానికి చెందిన మిగ్29, రాఫేల్ ఫైటర్లకు .. ఆ ట్యాంర్ ద్వారా ఆకాశంలోనే ఇంధనాన్ని నింపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్29 కూడా పాల్గొన్నది.