Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఉద్యోగుల స్పందనలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోండి జిల్లా అధికారులకు సూచించిన జిల్లా రెవెన్యూ అధికారి కే మధుసూదన్ రావు

0

కర్నూలు

ఉద్యోగుల స్పందనలో వచ్చిన అర్జీలను సకాలంలో  పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కే మధుసూదన్ రావు జిల్లా అధికారులకు సూచించారు.  శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో  నిర్వహించిన  ఉద్యోగుల స్పందన కార్యక్రమంలో  ఉద్యోగుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి కే మధుసూదన్ రావు  వినతులను స్వీకరించారు.

*ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కే మధుసూదన్ రావు మాట్లాడుతూ ఉద్యోగుల స్పందనలో వచ్చిన అర్జీలను సకాలంలో  పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, పరిష్కారానికి వీలులేని అర్జీలకు ఏ కారణంతో పరిష్కరించలేకపోయామో తెలుపుతూ ఎండార్స్మెంటును అర్జీదారునికి కచ్చితంగా అందజేయాలని డిఆర్ఓ సంబంధిత అధికారులకు సూచించారు .

ఒక వేళ  అర్జీలను జిల్లా స్థాయిలో కాకుండా ఆ పై అధికారులు  పరిష్కరించాల్సి ఉంటే వాటిని పై అధికారులకు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. గతంలో ఉద్యోగుల స్పందన కార్యక్రమములో ఉద్యోగులు సమర్పించిన అర్జీలలో డిడి సోషల్ వెల్ఫేర్, హౌసింగ్, డిఆర్డిఏ, ఐసిడిఎస్, ఆర్ అండ్ బి శాఖలను ఒక్కొక్క దరఖాస్తు పెండింగ్ ఉందని, సర్వజన వైద్యశాల యందు మూడు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని వీటన్నిటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులకు జిల్లా రెవిన్యూ అధికారి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie