Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలి : షేక్ యాస్మిన్ బాషా

0

జగిత్యాల, అక్టోబర్ 14
రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రకాల టీమ్ లు అప్రమత్తంగా ఉండి ఎన్నికల కమీషన్ ఆదేశాలను అమలు పరుస్తున్నామనీ జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు పరచడానికి టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మూడు నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల కోడ్ కు ముందు 6,603 పలు రకాల ప్రభుత్వ ప్రచారానికి సంబంధించి గోడలపై రాతలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఇతరత్రా తొలగించమని, ఇందులో 2,534 ప్రభుత్వ, 4,069 ప్రైవేట్ ప్రాంతాలలోని తొలగించడం జరిగిందని తెలిపారు. అనధికార మద్యం రవాణాను అరికట్టడంలో భాగంగా అబ్కారీ శాఖ అధికారులు, సిబ్బంది11 దాడులు నిర్వహించి 115.50 లీటర్ల అక్రమ లిక్కర్ సీజ్ చేయడం జరిగిందని, నాలుగు కేసులు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశామని తెలిపారు. 4.135 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ బాటిల్స్ సీజ్ చేసి ఒక కేసు నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళినీ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అక్రమంగా మద్యం, నగదు తరలిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  అక్రమంగా డబ్బు, మద్యం, వంటివి తరలిస్తున్న వారి సమాచారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్ 1800 425 7620 లేదా 1950 లకు గాని లేదా ఫోటోలు, వీడియోలు సి విజిల్ యాప్ ద్వారా గాని తెలియజేయ వచ్చని, అలాంటి సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie