Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎమ్మెల్యే మంచిరెడ్డికి నిరసన సెగ

0

ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సొంత గ్రామంలో నిరసన సెగ తగిలింది. ఎలిమినేడులో భూసేకరణ ఆపాలని రైతులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో పట్టా భూముల భూసేకరణ వెంటనే రద్దు చేయాలంటూ రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకున్న  పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులు, ఎమ్మెల్యేను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు మద్దతుగా  బిజెపి, కాంగ్రెస్ నేతలు నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie