ఎల్లమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు
నాగర్‌కర్నూల్
గ్రామ దేవతలను పూజిస్తేనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దనరెడ్డి, 5 లక్షల ఎస్ డి ఎఫ్, నిధులు మంజూరు చేయడం తో గ్రామ సర్పంచి కొట్టే అమృత రామ్ చంద్రయ్య ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి భూమి పూజ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత గ్రామ అభివృద్ధి చేస్తామని వారు కొనియాడారు. ఎల్లమ్మ గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్ రెడ్డికి గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొట్టే అమృత రామ్ చంద్రయ్య, ,ఉప సర్పంచ్ కొట్టే బలరామ్, సింగిల్ విండో డైరెక్టర్ జంపల్లి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ మోగుతాలా లింగమయ్య, బిఆర్ఎస్ నాయకులు కొట్టే బలరామ్, కడారి బాలస్వామి, కొట్టే తిరుపతయ్య, జాలo మల్లేష్. రాజు, బాలు, శ్రీను, లక్ష్మయ్య, ఆంజనేయులు, మల్లేష్ , చంద్రయ్య,బాల లింగం, లిగవయ్య, నరేందర్ గౌడ్, కృష్ణయ్య, ఎర్ర బాలస్వామి, గ్రామ ప్రజలు, మహిళలు రైతులు యువకులు తదితరులు పాల్గొన్నారు.