Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఒక్కసారి అవకాశం ఇవ్వండి…అభివృద్ధి చేస్తాం..

కాంగ్రెస్ ప్రచారం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి

0

జగిత్యాల

జగిత్యాల పట్టణంలోని 2 వ వార్డు లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ అర్రు గ్యారంటీ ల పై ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ కు ఓటు వేయండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి  చేస్తాం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెలా రు.2500, ఇవ్వడం తోపాటు సిలిండర్ రు.500 లకే ఇస్తాం.. మహిళలకు ఆర్ టీ సీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి స్తాం. రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీతో పాటు ప్రతి ఏటా రైతులు కౌలు రైతులకు రైతుబంధు పథకం కింద రు.15,000 అందిస్తాం. వ్యవసాయ కూలీలకు రు.12,000 అందిస్తాం.

మిరప పంట వేసి నాలుగు లక్షలు నష్టపోయిన రైతు వైరస్ ప్రభావం వల్ల మూడు ఎకరాల మిరప పంట నాశనం

వరి ధాన్యం మద్దతు ధరపై అదనంగా క్వింటాల్కు రు.500 బోనస్ కల్పిస్తాం. చేయూత పథకం కింద పెన్షన్ 4000 అందిస్తాం రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద పది లక్షల ఉచిత వైద్య సౌకర్యం. గృహ జ్యోతి పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తాం తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తాం. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు ఉన్నత చదువుకునేందుకు 5 లక్షల ఆర్థిక సహాయం కల్పిస్తాం.సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్ కార్డ్ ఆధారం. కేంద్రం పై రాష్ట్రం.. రాష్ట్రం పై కేంద్రం నెపం నెట్టి  సామాన్యుల పై సిలిండర్ ధర పెంచిన భారం వేశారు. కాంగ్రెస్ పాలనలో తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చినం. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం బియ్యానికి పరిమితం అయింది .

అమల్లోకి ఎన్నికల నిబంధనలు 50 వేలపైన క్యాష్ క్యారీ వద్దు

ఉమ్మడి రాష్ట్రంలోని రాయితీలు కొనసాగిస్తూ కొత్తగా పథకాలు అమలు చేయాలి..
తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని భావిస్తే కనీసం ఖాళీలు కూడా భర్తి చేయడం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు అంగట్లో సరుకులు అయ్యాయని అయన అన్నారు. ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఒక్కసారి కూడా డీ ఎస్సీ నిర్వహించలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఉద్యమ ఆకాంక్షలు నిర్వీర్యం చేసిన సీఎం కెసిఆర్ కు ఓటు అడిగే  నైతిక హక్కు లేదు.
కాంగ్రెస్ కు ఒకసారి అవకాశం కల్పించాలి. కళ్యాణ లక్ష్మి తో పాటు అదనంగా వధువు కు తులం బంగారం పెడతాం. నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేసిన ఆదరించండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేస్తా..అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie