Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఒక్క అవకాశం ఇవ్వండి..బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

0

హుజురాబాద్:  నవంబర్ 6 

ఇరవై ఏళ్లుగా చేయని అభివృద్ధి 5సంవత్సరాల్లో చేసి చూపిస్తాను .పేదోళ్ల కళ్ళలో ఆనందమే చూడడం కోసమే కొత్త మేనిఫెస్టో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నాకు ఒక అవకాశం కల్పించాలంటూ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం కమలాపూర్ మండలంలోని గుండేడు, కొత్తపల్లి, కన్నూరు, బీంపల్లి గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతు రుణమాఫీ, రైతులకు వ్యవసాయానికి 24 గంటలు కరెంటు అందించి రైతుబిడ్డగా పేరుగాంచాడు అన్నారు. గుండేడు గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారమే కుల సంఘాల భవనాలతో పాటు గుడులను కట్టించామని అన్నారు.

గత 20 సంవత్సరాలుగా ఏడుసార్లు ఇక్కడి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికల కష్టకాలంలో కూడా గెలిపిస్తే కనీసం రెండున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నియోజవర్గానికి రాకపోవడం బాధాకరమన్నారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదు సంవత్సరాలలోపు హుజురాబాద్ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఐదు సంవత్సరాలలో హుజురాబాద్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయకుంటే మరోసారి ఓటు కోసం మీ ముందుకు రానని అన్నారు. గత 15 సంవత్సరాలుగా మీకోసమే సేవసేవ చేస్తున్నానని, ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపిస్తే మరింత సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నారు. పేదోళ్ల కోసం కేసీఆర్ కొత్త మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు.

మేనిఫెస్టోలో ముఖ్యంగా రెండు వేల పెన్షన్ 5000 చేస్తామని, వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6వేలకు పెంచనున్న మన్నారు. మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతినెల 3000 రూపాయలు ఇవ్వనున్నామని, అలాగే గ్యాస్ సిలిండర్ ని కూడా కేవలం 400కే అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచనున్నామని, కెసిఆర్ ధీమా ఇంటింటికి భీమా అనే పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న ఇంట్లో ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి 5లక్షలు ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో గుండేటి జడ్పిటిసి కళ్యాణి, లక్ష్మణ్ రావు,సర్పంచ్ లక్మన్ రావు,  సాంబయ్య గౌడ్, మాజీ సర్పంచ్ తిరుపతి రావు, సత్యనారాయణ రావు, రైతు కమాన్ వయా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, భీంపల్లి గ్రామ సర్పంచ్ కుమారస్వామి, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ లతోపాటు వార్డ్ మెంబర్లు నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పాడి శాలిని రెడ్డి మాట్లాడుతూ….15 ఏళ్లుగా మీ మధ్యలోనే తిరుగుతున్నాం మీ ఆడబిడ్డగా కొంగు చాపి అభ్యర్థిస్తున్న ఒక్క అవకాశం ఇవ్వండి గత 15 సంవత్సరాలుగా మేము ప్రజాసేవ కోసమే మీ మధ్యలోనే తిరుగుతున్నామని ఒక్క అవకాశం ఇచ్చి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలంటూ హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని కోరారు. మీ ఆడబిడ్డగా కొంగు చాపి అభ్యర్థిస్తున్న కావకాశం ఇవ్వమని ప్రాధేయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో మీకు సేవ చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie