Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కర్నూలులో బంగారం గనులు..

0

కర్నూలు, అక్టోబరు 10, (న్యూస్ పల్స్)

త్వరలో, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గని నుంచి భారీ స్థాయిలో బంగారాన్ని తవ్వి తీయబోతున్నారు. ఇది, దేశంలోనే తొలి, అతి పెద్ద ప్రైవేట్ బంగారు గని. ఈ మైన్ ఓనర్‌ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల మధ్య ఈ బంగారు గని ఉంది. దీనిని జొన్నగిరి గోల్డ్‌ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు.జొన్నగిరి ప్రాజెక్టులో పూర్తి స్థాయి ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ గనిలో ప్రయోగాత్మకంగా మైనింగ్‌ పనులు జరుగుతున్నాయి, నెలకు ఒక కిలో పసిడిని (ఏడాదికి 12 కిలోలు) బయటకు తీస్తున్నారు. 2024 అక్టోబరు-నవంబరు నాటికి ఫుల్‌ స్కేల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభం అవుతుంది, అప్పుడు ఏడాదికి 750 కిలోల బంగారాన్ని (నెలకు సగటున 62.5 కిలోలు) ఉత్పత్తి చేస్తామని కంపెనీ MD ప్రసాద్ చెప్పారు.జొన్నగిరి బంగారు గనిని అభివృద్ధి చేస్తున్న జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో డీజీఎంఎల్కు 40 శాతం భారీ వాటా ఉంది. ఈ గని కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు.

ఈ తొలి ప్రైవేట్‌ గనికి 2013లోనే అనుమతులు వచ్చాయి. బంగారాన్ని తవ్వి తీయడానికి అవసరమైన ముందస్తు పనులన్నీ పూర్తి చేయడానికి 8-10 సంవత్సరాలు పట్టింది.డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు, కిర్గిజ్‌స్థాన్‌లోనూ ఒక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు (ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు) ఉంది. ఆ గనిలో డీజీఎంఎల్కి 60 శాతం వాటా ఉంది. అక్కడ కూడా గోల్డ్‌ ప్రొడక్షన్‌ 2024 అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్టు నుంచి ఏటా దాదాపు 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ప్లాన్‌.డీజీఎంఎల్ను 2003లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రమోటర్లకు ఎక్స్‌ప్లోరేషన్‌ & మైనింగ్ సెక్టార్‌లో మంచి అనుభవం ఉంది. డీజీఎంఎల్ చాలాకాలంగా భారత్‌ సహా విదేశాల్లో బంగారు అన్వేషణ కార్యకలాపాల్లో ఉంది. మన దేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో డీజీఎంఎల్ అన్వేషణ ఫలితంగా హట్టి, ధార్వార్-షిమోగా ప్రాంతాల్లో గోల్డ్‌ డిపాజిట్స్‌ బయటపడ్డాయి.2021 నుంచి, వ్యాపార విస్తరణ & వైవిధ్యం కోసం ఇతర కంపెనీలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడాన్నీ డీజీఎంఎల్ కొనసాగిస్తోంది.బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌, BSEలో లిస్ట్‌ అయిన మొదటి & ఏకైక ‘బంగారం అన్వేషణ సంస్థ’  దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్). వచ్చే ఏడాది చివర నుంచి జొన్నగిరి గోల్డ్‌ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో బంగారం ఉత్పత్తి ప్రారంభిస్తారన్న వార్తతో ఈ స్టాక్‌ ఈ రోజు రూ. 95.52 వద్ద 5% అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయింది.

కేవలం గత ఆరు నెలల కాలంలోనే ఈ స్క్రిప్‌ దాదాపు డబుల్‌ (98.34%) అయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 143% రిటర్న్స్‌ ఇచ్చింది. గత ఒక ఏడాది కాలంలో (గత 12 నెలల్లో) ఏకంగా రెండున్నర రెట్లు (253%) పెరిగింది.ఇప్పటికే పైలట్ స ఆపరేషన్ ప్రారంభించిన జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని ప్రసాద్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2013లో ప్రారంభించిన బంగారం అన్వేషణ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సుమారు 8-10 సంవత్సరాలు పట్టిందని అని ప్రసాద్ వివరించారు.డెక్కన్‌ గోల్డ్ మైనింగ్‌ సంస్థకు 60 శాతం వాటా ఉన్న కిర్గిజ్‌స్థాన్‌లోని మరో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ నుండి 2024 అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్ట్ సంవత్సరానికి 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుందని వివరించారు. డెక్కన్‌ గోల్డ్‌ మైనింగ్‌ సంస్థను మైనింగ్ రంగంలో లోతైన మూలాలు ఉన్న ప్రమోటర్లతో 2003లో స్థాపించినట్టు చెప్పారు. డీజీఎంఎల్ సుదీర్ఘ కాలంగా భారతదేశంతో పాటు విదేశాలలో బంగారు అన్వేషణ కార్యకలాపాలలో పాల్గొంటున్నామని వివరించారు.కర్ణాటకలో డీజీఎంఎల్ చేపట్టిన అన్వేషణలో ధార్వార్ క్రాటన్ ఆర్కియన్ గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లలో ఓపెన్ పిట్బుల్ గోల్డ్ నిక్షేపాలను కనుగొందని చెప్పారు. ఈ నిక్షేపాలు హట్టి, ధార్వార్ – షిమోగా బెల్ట్‌లలో ఉన్నాయని చెప్పారు. 2021 నుండి కంపెనీ విస్తరణ చేపట్టినట్టు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie