నిజామాబాద్: నిజామాబాద్ న్యూ కలెక్టరేట్ వద్ద నందిపేట సర్పంచ్ సాంబారు వాణి ఆమె భర్త తిరుపతి ఆత్మహత్యాయత్నం చేశారు. తాము పద్మశాలి కులానికి చెందిన సర్పంచు అవడంవల్ల గత నాలుగు సంవత్సరాల నుండి స్థానిక ఉపసర్పంచ్ మాద రవి అభివృద్ధి పరిచిన బిల్లులపై సంతకాలు పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సుమారు కోటిన్నర రూపాయలు నందిపేట మండల అభివృద్ధికి వెచ్చించానని బిల్లులు మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదని సర్పంచ్ సాంబారు వాణి ఆరోపించారు.
కోటిన్నర లక్షలకు మిత్తితో కలిపి మూడు కోట్లకు పైగా అప్పు అయిందని అప్పుల బాధ భరించలేక కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించమని వారు వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కలెక్టరేట్ ఎదుట కూర్చున్నారు. సర్పంచ్ భర్త తనతో తెచ్చుకున్న పెట్రోలు తన భార్య సర్పంచ్ వానిపై తనపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు.