Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు…

తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ హవా...   కశిరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన...

0

నాగర్ కర్నూల్

 పేద ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కశిరెడ్డి నారాయణ రెడ్డి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, ఎఐసిసి కార్యదర్శి, కల్వకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గార్లు అన్నారు. బుధవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ప్రచారంలో భాగంగా తలకొండపల్లి మండలం పెద్దూరు తాండ, దేవునిపడకల్, పడకల్ గ్రామ పంచాయతీలలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందినవందలాది మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు  కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వారికి కశిరెడ్డి నారాయణరెడ్డి, చల్లా వంశీచంద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.అనంతరం రామకృష్ణాపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటుందన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజల నుండి అనుహ్యమైన స్పందన లభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామల్లో నిర్వహించిన ర్యాలీలకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie