Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే రైతుల‌కు మ‌ళ్లీ క‌ష్టాలు : సిఎం కేసీఆర్

ఆ పార్టీ త‌న భుజం మీద గొడ్డ‌లి పెట్టుకుని రెడీగా ఉంది అబ‌ద్దాలు, మోస‌పు మాట‌ల‌తో, ఆప‌ద మొక్కులు మొక్కుతారు బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సిఎం కేసీఆర్

0

రాజ‌న్న సిరిసిల్ల అక్టోబర్ 17
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే పెద్ద ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ త‌న భుజం మీద గొడ్డ‌లి పెట్టుకుని రెడీగా ఉంద‌ని, రైతుల‌కు మ‌ళ్లీ క‌ష్టాలు తీసుకొస్త‌ద‌ని కేసీఆర్ అన్నారు. రాజ‌న్న సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఇవాళ ఎక్క‌డా చూసినా ప‌చ్చ‌టి పంట పొలాల‌తో ఒక బెత్త‌డి జాగా ఖాళీ లేకుండా వ‌రి నాట్లు క‌న‌డ‌బుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది చాలా సంతోషం. మూడు కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించే నా తెలంగాణ బిడ్డ‌లు.. స‌న్న‌బియ్యం తినాల‌నే ఉద్దేశంతో, వ‌చ్చే ప్ర‌భుత్వంలో స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని మేనిఫెస్టోలో పెట్టుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.అబ‌ద్దాలు, మోస‌పు మాట‌ల‌తో, ఆప‌ద మొక్కులు మొక్కుతూ వ‌చ్చే వారుంటారు.. వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేసీఆర్ సూచించారు. కేటీ రామారావు గుణ‌మేందో. గ‌ణ‌మేందో మీకే ఎక్కువ తెలుసు. ఇక్క‌డ రావాల్సిన‌వి వ‌చ్చాయి.

నాందేడ్ బరిలో కేసీఆర్! లేదా ఔరంగాబాద్!!

గొప్ప విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం. నీళ్లు పుష్క‌లంగా వ‌చ్చాయి. అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి ఏర్ప‌డే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఆప‌ద మొక్కులు మొక్కే వారు చాలా మంది వ‌స్తుంటారు. ఒక పెద్ద ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది. రైతు సోద‌రుల‌ను హెచ్చ‌రిస్తున్నా. మూడు సంవ‌త్స‌రాలు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ధ‌ర‌ణి పోర్ట‌ల్ తీసుకొచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలి. కౌలుకు ఇచ్చినంత మాత్రాన ఇంకోక‌రి ప‌రం కావొద్దు అని ధ‌ర‌ణిని తీసుకొచ్చాం. రిజిస్ట్రేష‌న్లు పావుగంట‌లో అయిపోతున్నాయి. ధ‌ర‌ణి వ‌ల్ల 98 శాతం మంది రైతుల‌కు మేలు జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డ‌లి పెట్టుకుని రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తే ధ‌ర‌ణిని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తార‌ట‌. మ‌ళ్లీ వీఆర్‌వోలు, గిర్దావ‌ర్‌లు వాని భూమి వీనికి రాసి, వాని భూమి ఇంకోక‌రికి రాసి, మ‌ళ్లీ రైతుల‌ను కోర్టుల చుట్టు తిప్పే ప‌రిస్థితి వ‌స్తుంది. మీ మీద వీఆర్వో, గిర్డార‌వ్, డిప్యూటీ త‌హ‌సీల్దార్, త‌హ‌సీల్దార్, ఆర్డీవో, జాయింట్ క‌లెక్ట‌ర్, జిల్లా క‌లెక్ట‌ర్, రెవెన్యూ సెక్ర‌ట‌రీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి ఉండేవారు. వీరిలో ఒక‌రికి కోప‌మొచ్చినా రైతు భూమి ఆగ‌మ‌య్యేది. కానీ ఇవాళ ఆ అధికారం తీసేసి రైతుల‌కే అధికారం ఇచ్చాం. మీ బొట‌న వేలి ప్ర‌మేయం లేకుండా.. భూమి ఇత‌రుల‌కు పోయే అవ‌కాశం లేదు. మీ భూమి హ‌క్కులు మీ బొట‌న‌వేలితోనే మారుతాయి. ఈ  సిగ్గుమాలిన కాంగ్రెస్ మాట‌లు న‌మ్మ‌కండి.. ఇవాళ ధ‌ర‌ణి పుణ్యం వ‌ల్ల ప‌ల్లెలు ప్ర‌శాంతంగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా ఉన్న ప్ర‌మాదం వ‌చ్చి నెత్తిన ప‌డుత‌ది. మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌స్త‌ది.. చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుతున్నాను. అనేక రంగాల్లో.. మ‌నం నంబ‌ర్‌వ‌న్‌గా ఉన్నాం అని కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie