Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ లో చేరికలు

0

మేడ్చల్

మేడ్చల్ నియోజకవర్గ  బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డిని మళ్ళీ పాలు అమ్ముకునేటట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ కోరారు. బోడుప్పల్ లో తెలంగాణ ఉద్యమకారుడు నత్తి మైసయ్యతో పాటు బి.ఆర్.ఎస్ కు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రేష్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను మరిచిన చరిత్ర కేసీఆర్ ది అని, గత 23 సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ పార్టీకి సేవలందించిన నత్తి మైసయ్యను కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోందన్నారు. స్థానిక  ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని వజ్రేష్ యాదవ్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie