కులం పేరుతో తిట్టి చెప్పుతో కొట్టిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
బద్వేలు
కులం పేరుతో దూషించి చెప్పుతో కొట్టిన వ్యక్తిపై బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు పంచాయతీ పెడుతూ పిలిచి అందరు సమక్షంలో కులం పేరుతో దూషించడమే కాకుండా చెప్పుతో కొట్టిన అతనిపై దళితులు మండిపడుతున్నారు వివరాలు ఇలా ఉన్నాయి బద్వేల్ మండలం బయనపల్లె గ్రామానికి చెందిన జింక జయపాల్ అనే వ్యక్తి బాడుగ విషయంలో సమస్య వచ్చింది అదే గ్రామానికి చెందిన గాజుల పల్లె కృష్ణారెడ్డికి జయ పాల్ కు
సమస్య రావడంతో వివాదం ఏర్పడింది దీంతో అదే గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు ఈ పంచాయతీలో కృష్ణారెడ్డి జయపాల్ ను నాన దుర్భాష లాడి కులం పేరుతో దూషించాడు అంతేగాక జయపాల్ ను అందరూ సమక్షంలో చెప్పుతో కొట్టడం జరిగింది.