Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

  కులగణనపై ఒక స్పష్టమైన కార్యాచరణ

0

కాకినాడ
వెనుక బడిన తరగతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్య, సంక్షేమం, నివాసం వంటి అంశాలలో ప్రాధాన్యత కల్పించే దిశగా  రాష్ట్ర ముఖ్యమంత్రి కుల గణన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ కులగణనపై ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించడం జరిగిందని, తీరదు…అనుకున్న బీసీల కోరిక తీరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ఆ బాధ్యతను బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన నాకు అప్పగించినందుకు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి అన్నారు.  సమగ్ర  కుల గణన ద్వారా ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వారు ఎవరు?… వారికి ప్రస్తుతం ఇస్తున్న ప్రయోజనాలతో ఎంత మేలు జరుగుతుంది, ఇంకా వారి ప్రయోజనాలకు కొరకు కొత్త  కార్యాచరణ చేపట్టాలా? …అని ఆలోచన చేయడానికి ఈ కుల గణన ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. వెనుక బడిన కులాల సంక్షేమం, వారి అభివృద్ధి సంక్షేమ సూచికలు తయారు చేయడంలో కుల గణన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు.  పాకిస్తాన్, భారతదేశం కలిసి ఉన్న సమయంలో 1901లో ప్రారంభమైన గణన 1911, 1921, 1931 లలో కుల గణన జరిగిందని , 1941లో జనగణన జరిగినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం, స్వాతంత్రం వచ్చే తరుణంలో అవి బయటకు రాలేదని మంత్రి అన్నారు.

తిరుపతి గంగజాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు.

అనంతరం 1951లో ప్రారంభమైన జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నప్పటికీ కుల గణన జరగడం లేదన్నారు. జన గణన జరిగినప్పటికీ  ఎస్సీ, ఎస్టీల లెక్కలు మాత్రమే తెలుస్తున్నాయని, మిగిలిన కులాల వివరాలు గంపా గుత్తాగా జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎప్పటినుండో ఒక సుదీర్ఘ కోరికగా ఉండి తీవ్రమైన బాధ, సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నామో తెలియదు అనేటటువంటి ఇబ్బందులలో బీసీ కులాలు ఉన్నాయని మంత్రి అన్నారు. దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  సునిశితంగా పరిశీలించి మన రాష్ట్రంలో కుల గణన జరిపించాలని ఏప్రిల్ 11 న మహాత్మా  జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నాడు ప్రకటన చేశారని అందుకు గాను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సంతోషపడుతున్నానని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆదేశాలతో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేసి వారినుండి  కులగణన చేయడానికి ఇతర రాష్ట్రాలలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా.. జరిగితే ఎటువంటి పద్ధతులు అనుసరించారో తెలుసుకున్న తరువాత నవంబర్ 15 వ తేదీ తరువాత ప్రక్రియ ఈ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుందని మంత్రి అన్నారు. సచివాలయ ఉద్యోగులను అందులో భాగస్వామ్యులను చేసి కులగణన జరుగబోతుందని అన్నారు. ఈ కుల గణనను ప్రారంభించే ముందు వివిధ కుల సంఘాల నాయకులు, పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క  అనుభవ అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు. దానికి ఒక ఈమెయిల్ అడ్రస్ ని క్రియేట్ చేసి దాని ద్వారా సలహాలు, సూచనలను తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి యొక్క సూచనలను కూడా తీసుకోవాల్సింది గాను వారు  కులగణనపై చేసిన అధ్యయనం ప్రకారం వారి సూచనలను ప్రభుత్వం పనిలోనికి తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి తెలిపారు. కులగణన జరిపించడం అనేది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఒక పెద్ద ఊరటయని, ఎంతోకాలంగా ఉన్న కోరికను రాష్ట్ర ముఖ్యమంత్రి  తీరుస్తున్నందున బిసి వర్గాల మనసులో ఆయన  ఒక చెరగని ముద్ర వేసుకుంటారని మంత్రి అన్నారు. తద్వారా రాష్ట్రంలో బలహీన వర్గాల తీరని వాంఛ నేరవేరుతుందని మంత్రి అన్నారు. ఇది బలహీనవర్గాల ప్రభుత్వమని, బలహీన వర్గాలు కోరుకున్న ప్రతి అంశాన్ని పరిష్కరించడమే ముఖ్యమంత్రి గొప్పతనమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie