Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కూష్మాండా దేవి అలంకరణలో బాల త్రిపుర సుందరి దేవి

0

తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోదేవి  శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం లో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం అమ్మవారిని కూష్మాండా దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి మాట్లాడుతూ ఆరాధించడం వల్ల సర్వ శుభ ఫలితాలు పొందవచ్చునున్నారు. ప్రత్యేకించి స్త్రీలు సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం కుటుంబ సౌఖ్యం కోసం అమ్మవారిని అర్చిస్తారని.శ్రీ చక్రంతో కూడుకున్న అతి పురాతనమైన కుష్మాండ దేవి ఆలయం వారణాసిలో ఉందని దీన్నే దుర్గా కుండ్ అని కూడా పిలుస్తూ ఉంటారని తెలిపారు. శాస్త్రం ప్రకారం ఉపాసనాపరులు నాలుగవ దుర్గగా ఈ కుష్మాండా రూపంలో అమ్మవారిని అర్చిస్తారని అమ్మవారి తొమ్మిది అవతారాల విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద విత్తనం చేశారు. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠ ప్రతినిధి ఈమని శశి కుమార్ శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie