ఆసిఫాబాద్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.. వాగులు దాటలేక స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.. కెరమెరి మండలం కరంజివాడ గ్రామ పంచాయతీ పరిధిలోని బోరిలాల్ గూడ నుంచి ఆదిలాబాద్ రావాలంటే..అనార్ పల్లి వాగు దాటాలి. ఈ గ్రామానికి చెందిన జాదవ్ అశ్విని ఏడు నెలల గర్భిణి. నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా ఆమెను బుధవారం ఆదిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులో ప్రవాహం పెరగడంతో వాయిదా వేస్తూ వచ్చారు. శుక్రవారం వరద కొంచెం తగ్గడంతో గర్భిణిని చేతులపై మోస్తూ ఇలా ఒడ్డుకు చేర్చారు.