Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కేంద్రంలో చెంచాగిరి, రాష్ట్రంలో దాదాగిరి చేస్తున్న జగన్ బిజెపి నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

0

కడప

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం. .ఈ అరెస్ట్ చట్టబద్ధంగా జరగలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. రిమాండ్ రిపోర్టులోనే తప్పు ఉంది. నంద్యాలలో అరెస్టు చేసి మరోచోట అరెస్టు చేసినట్టు చూపించారు. ఉదయం నుంచి హంగామా చేసి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు చూపించారు.

బీజేపీ కి చంద్రబాబు నాయుడు అరెస్టు కు సంబంధం లేదు. నువ్వు తోడేలు లాంటి వాడివి నీతో మేము ఎలా కలిసి పని చేసాం. ఈ రాష్ట్రం కాలిపోయింది కూలిపోయింది బూడిద అయిపోతుంది నీ వల్లే. కోడి కత్తి కేసు ఓ డ్రామా కాదా. దేశంలో జి 20 సదస్సు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఈ అరెస్టులు ఏమిటని ప్రశ్నించారు. జీ 20 సదస్సుకు అన్యాయం చేయడం కోసమే ఈ అరెస్టులు. 190 దేశాలు మన దేశానికి వస్తే నువ్వు చేస్తున్న అరాచకం ఏమిటి.

నీ వ్యాపారం నీ దోపిడీ కోసం ఈ అరెస్టులు చేస్తున్నావు, వివేక హత్య కేసులో నీ బంధువులకు మాత్రం రక్షణ కల్పిస్తున్నావు.. రాష్ట్రంలో లక్షల కోట్ల దోపిడీలు జరుగుతున్నాయి. .కడప జిల్లా పేరు కూడా మార్చేశి నీ తండ్రి పేరు పెట్టుకున్నావు. చంద్రబాబును అరెస్టు చేయమని బిజెపి చెప్పిందా…ముఖ్యమంత్రి దౌర్జన్యాన్ని బిజెపి ఖండిస్తోంది. నీకు చెక్కు పెట్టెది ఒక బీజేపీ పార్టీ మాత్రమే. పీవీ రమేష్ స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు. పదేపదే న్యాయం కోసం పోరాడుతాం లేకుంటే గురు గోవింద్ సింగ్ చెప్పినట్లు కత్తి చేత పట్టుకుంటాం అని సిద్ధార్థ లూత్ర చెప్పిన మాట వాస్తవమే. ఇక్కడ జరుగుతున్నవన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా.

ఇప్పటికే లడ్డా అదృష్టకి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. వృద్ధుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన రామోజీరావును కూడా ఈ ప్రభుత్వం సతాయిస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో జీరో నామినేషన్లు. నామినేషన్లు వేస్తే చంపుతామని నరుకుతామని బెదిరించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది. .అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడికి పోయింది. నేనే రాజు నాదే రాజ్యాంగం అని ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ అన్న పూర్ణ రాష్ట్రం.. అందరూ ఏకమై ఈ దురాచకాలను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీ రాజ్యసభ, లోకసభ సీట్లతో బిజెపికి అవసరం లేదు. బిజెపి దేశ నేతల వద్ద చంచాగిరి ,రాష్ట్రంలో దాదాగిరీ చేస్తున్నావు. ప్రత్యేక హోదా ప్రత్యేక  ప్యాకేజీ తెచ్చే పరిస్థితి నీకు లేదని అన్నారు. పవన్ టిడిపి తో పొత్తుపై స్పష్టత బిజెపి ఇవ్వలేదు. రాష్ట్రంలో జరుగుతున్న పర్యావసనాలపై ఇప్పటికే మేము బిజెపి పెద్దలతో చర్చించాం. ఈ ప్రభుత్వంపై బిజెపి అధిష్టానం కూడా వ్యతిరేకంగానే ఉంది. కేంద్ర బిజెపి నేతల అభిప్రాయం మేరకు రాష్ట్రంలో పొత్తులుంటాయని అయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie