Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కైకైలాసద్వారం దగ్గర ఉగాది ఏర్పాట్ల ను పరిశీలించిన శ్రీశైల దేవస్థానం ఈవో

0

శ్రీశైలం
శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 06 నుండి 10వరకు అయిదు రోజులపాటు నిర్వహింపబడనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పాదయాత్రతో క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. అందుకే కాలిబాటలో అటవీశాఖ, వైద్యఆరోగ్యశాఖ మొదలైన శాఖల సమన్వయముతో పలు ఏర్పాట్లు చేస్తున్ఆనరు. ఇందులో భాగంగా కైలాసద్వారం వద్ద భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేయడం జరిగింది. కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసారు. కైలాసద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేయడం జరుగుతోంది. ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైడ్లైన్ ద్వారా మంచినీరు అందిస్తున్నారు.
దాతలు నిర్వహిస్తున్న ఈ అన్నదాన నిర్వహణకు దేవస్థానం పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా అన్నదాన నిర్వహణకు చలువపందిర్లు ఏర్పాటు, మంచినీటిసరఫరా, మజ్జిగ సరఫరా, విద్యుద్దీకరణ మొదలైన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేసారు.  

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie