కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల మంత్రి వేముల సంతాపం
వేల్పూర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన హరిశ్వర్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని కొనియాడారు. హరీశ్వరరెడ్డి గారి కుమారుడు ప్రస్థుత పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.