Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కోల్ కత్తలో అండర్ వాటర్ మెట్రో

0

కోల్ కత్తా, సెప్టెంబర్ 14

భారతదేశంలో మెట్రో రైళ్లు వంతెనపై నుండి వెళ్లటం చూశారు. భూగర్భంలోంచి వెళ్లడం చూశారు. అయితే అది నీటి కిందకు వెళ్లడం చూశారా.? అవును మీరు చదివింది నిజమే..మన దేశంలో త్వరలోనే నీటి అడుగున ప్రయాణించే మెట్రోరైలు అందుబాటులోకి రానుంది. డిసెంబరు నుండి కోల్‌కతాలో భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున నడిచే మెట్రో రైలు ప్రారంభంకానుంది. ప్రాజెక్టు చివరి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని, డిసెంబర్ నాటికి మొదటి లైన్ సిద్ధం అవుతుందని కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.నగరం తూర్పు-పశ్చిమ భాగాన్ని కలిపే మార్గం మొత్తం 16 కి.మీ. ఈ మార్గం నీటి అడుగున 4.8 కి.మీ మాత్రమే నడుస్తుంది. ఎస్ప్లానేడ్ ప్రాంతాన్ని హౌరా స్టేడియంతో కలుపుతుంది.

ఈ మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి 12 నిమిషాలకు ఒక మెట్రో రైలు ఈ మార్గంలో నడుస్తుంది.రైల్వే సేఫ్టీ కమిషనర్ నవంబర్ చివరిలో ఎస్ప్లానేడ్ – హౌరా మైదాన్ మార్గాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. రైల్వే ట్రాక్‌లు నీటిలో ఉన్నందున రైల్వే సేఫ్టీ కమిషనర్‌తో తనిఖీలు తప్పనిసరి. ఎలాగైనా డిసెంబర్ నెలాఖరులోగా మెట్రో సేవలు ప్రారంభమవుతాయని కోల్ కతా మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవద్స విశ్వాసం వ్యక్తం చేశారఏప్రిల్ 13న ఎస్ప్లానేడ్-హౌరా మైదాన్ మధ్య ట్రయల్ రన్ ప్రారంభమైంది. సెంట్రల్ పార్క్ నుండి తీసుకువచ్చిన రెండు కోచ్‌ల రైలు ప్రస్తుతం హౌరా మైదాన్‌లో రైలును ఆపడానికి తగిన సౌకర్యాలు లేకపోవడంతో సాల్ట్ లేక్ వద్ద ఆగిపోయింది.

ఈ హైటెక్ కోచ్‌లకు తరచుగా మెయింటెనెన్స్ అవసరం కాబట్టి, వాటిని వారానికి ఒకసారి సెంట్రల్ పార్క్ డిపోకు తీసుకురావాలి. డిసెంబర్ నాటికి తూర్పు వైపు సొరంగం సిద్ధం కాకపోతే సెంట్రల్ డిపో నుంచి ప్రతి వారం ఈ రైలును తీసుకురావడం చాలా కష్టమైన పనిగా మారుతుందని అంటున్నారు.
తూర్పు-పశ్చిమ మార్గంలో పునాది పనులు చాలా క్లిష్టంగా ఉండడంతో ఈ జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. మరియు 2.4km సీల్దా-ఎస్ప్లానేడ్ విభాగం చాలా సవాలుగా ఉంది. కొండచరియలు విరిగిపడటం వల్ల కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు నార్వేకు చెందిన జియో ఫ్రాస్ట్ అనే కంపెనీతో KMRC చేతులు కలిపింది. దీనితో, నీటి మట్టం, భూమిని గడ్డకట్టడం ద్వారా మైక్రో టన్నెల్స్ సులభంగా నిర్మించవచ్చు. మైనింగ్‌లోకి నీరు చేరకుండా అనేక సేఫ్టీ ఫీచర్లను ఏర్పాటు చేశామని, నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు యాష్, సిలికా కాంపౌండ్స్‌ను వినియోగించామని శ్రీవత్స తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie