గిరిజనులకు అండగా సీఎం జగన్ – మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సారవకోట,
సారవకోట,
గిరిజనులకు అండగా వైఎస్ జగన్మోహనరెడ్ది నిలుస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం గుమ్మపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. ఈ గ్రామమ్ళో ఉన్న గిరిజనులను కలవడం చాలా ఆనందంగా ఉందని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. వీరికి రహదారి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత రహదారి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అలాగే విద్యుత్ సమస్య ఉందని తనకు తెలియజేశారని, సింహాద్రి అప్పన్న ఆలయం కావాలని కోరారు. వాటిని అతిత్వరలోనే నిర్మాణం చేపడుతామన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత గిరిజనులకు అధిక ప్రాధాన్యనిస్తున్నారని దీనికి నిదర్శనం గిరిజన వ్యక్తికే ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన హయాంలో తాను ఎమ్మెల్యే ఉండడం నా అదృష్టమని కృష్ణదాస్ పేర్కొన్నారు. గిరిజనులు అడిగిన సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరించి వైసీపీ పార్టీ పట్ల గిరిజనులకు మరింత అభిమానం కల్పించి, ముఖ్యమంత్రికి అండగా ఉండే విధంగా అందరం కలిసి పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.