Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఘనంగా రంజిత్ కుమార్ జన్మదిన వేడుకలు

0

తాండూర్

తాండూర్ మండల కేంద్రంలో రేచీని గ్రామానికి చెందిన  కొడిపాక రంజిత్ కుమార్ జన్మదిన సందర్భంగా అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఐబి సెంటర్లో అల్పాహారం పంపిణీ కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా అభినవ సంతోష్ కుమార్ మాట్లాడుతూ యువకుడు ఉత్సాహవంతుడు స్నేహశీలి, దయాగుణం గల నాయకుడు, పదిమందికి చేదోడు వాదోడుగా సహాయం చేసే యువకుడు ప్రతి పనిలో తన హస్తం ఉండే విధంగా మెలిగే యువకుడు మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా సినిమా రంగంలో చిన్నచిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా భావితరాలకు ఆదర్శంగా పారిశ్రామికవేత్తగా ఉంటూ పదిమందికి సహాయపడే ఉదార స్వభావం ఉన్న యువకుడు ఉత్సాహవంతుడు  రంజిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఇలాంటి పుట్టినరోజులు వంద సంవత్సరాలు జరుపుకోవాలని  నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖసంతోషాలతో ఉండేలా పిల్లాపాపలతో కలకలలాడుతూ సుఖంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ . ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని దానిలో భాగంగా ఉదయము అల్పాహారం పంపిణీ మధ్యాహ్నము గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ సాయంకాలం అంగడి సందర్భంగా దూర ప్రాంతాల నుండి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తున్న వారికి అల్పాహారం పంపిణీ మధ్యాహ్నము బెల్లంపల్లిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు రాజుకిరణ్ శ్రీనివాస్ రమేష్ శంకరయ్య నరేష్ క్రాంతి రాజు విజయ్, తాజ్ తిరుపతి కుమార్ విజయ్ సాయి, కిరణ్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie