Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చంద్రబాబుతో పవన్ భేటీ

0

హైదరాబాద్, డిసెంబర్ 6, 

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు.  హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ వచ్చిన నారా లోకేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే మార్చిలోనే సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో .. కూటమిగా చేయాల్సిన పనులు, సీట్ల సర్దుబాటు, ఇతర ఎన్నికల వ్యూహాలపై వీరు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్ మొదటి సారి చంద్రబాబుతో సమావేశం అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie