వారు పెట్టె బాధను తట్టుకోలేక పోతున్నాను 85 వృద్ధుడి ఆవేదన
గుంటూరు: కన్న బిడ్డలే కాల యముడులై ఆస్తులకోసం కన్న తండ్రిని నిత్యం కొడుతూ చంపడానికి చూస్తున్నారంటూ (85) తండ్రి గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన దయనీయ ఘటన గుంటూరులో వెలుగు చూసింది. కోట్ల రూపాయల ఆస్తులను సoపాదించాను. ఆ డబ్బును, ఆస్తులను ఇవ్వాలని నిత్యం కొడుతున్నారంటూ మహబూబ్ ఖాన్ (85) కన్నీటి పర్యంతరం అవుతున్నాడు. అయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చివరకు నా మూలంగా కుమార్తె కూడా నా కొడుకుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. గతంలో బంగారం వ్యాపారం , పొగాకు వ్యాపారం చేసాను. నాకు నా కుమార్తెకు రక్షణ కల్పించండి అయ్యా.. లేకపోతే ఆత్మహత్య చేసుకొనే అవకాశం కల్పించండి అంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అరే బడ్డే (ముసలోడా) నువ్వు ఎక్కడికి పోయినా ఏమి చెయ్యలేవు అంటూ కొడుకులు బెదిరిస్తున్నారని వృద్ధుడి ఆవేదన వ్యక్తం చేసాడు.
బిడ్డలు విచక్షణా రహితంగా కొడుతున్నారంటూ, పొరుగువారు వచ్చి సర్దుబాటు చేయడానికి వస్తే వారినికుడా రావద్దంటు హుకుం జారి చేస్తారంటు ఆవేదన వ్యక్తం చేశారు. నేను బంగారం వ్యాపారం చేసే రోజుల్లో ఇతర దేశాల నుండి నాదగ్గరకు వచ్చి బంగారం కొనుగోలు చేసేవారు. వ్యాపారం నిజాయతీగా చేసాను. ఇప్పటి కూడా నాతో వ్యాపారం చేసిన వారు అందరు విదేశాల నుంచి ఫోన్ చేసి మాట్లాడతారు. నిజాయతీగా బ్రతికిన నాకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని వృద్దుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు తక్షణమే స్పందించాలని వేడుకుంటున్నాను అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.