Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చెట్టును డీకొట్టిన కారు ఐదుగురికి తీవ్ర గాయాలు

0

మదనపల్లి

మదనపల్లి ఐదవ మైలు వద్ద అర్థ రాత్రి చెట్టును కారు డీకొంది. ఘటలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. . గాయపడ్డ వారిలో మదనపల్లి మోతినగర్ లో ఉంటున్న కే. మహమ్మద్ రజాక్ (45), ఆయన చెల్లెలు సాహీరా భాను(40), బావ మరుదులు మహమ్మద్ సైఫ్ (16), సోహెబ్ (10), మరదలు హసీనా కుబ్రా (13)లు తిరుపతికి వైద్య చికిత్స కోసం వెళ్లి, తిరిగి మదనపల్లికి  తిరిగి వస్తున్నారు. డ్రైవర్ కు నిద్ర  రావడంతో కారు అదుపు తప్పి సిటీయం రోడ్డులోని 5వ మైలు వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకోంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని మదనపల్లి 108 సిబ్బంది భార్గవ, దివ్యశ్రీ లు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహమ్మద్ సైఫ్ పరిస్థితి సీరియస్ కావడంతో డాక్టర్లు తిరుపతికి రెఫర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie