మెదక్
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నారని గ్రామస్థులు ఇద్దరిని చెట్టుకు కట్టేసి బంధించారు. నర్సాపూర్ (మం) పాప్య తండాలో ఘటన జరిగింది. గురువారం అమావాస్య కావడంతో తండాలో గుర్తు తెలియని వ్యక్తులు పలువురి ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు కుంకుమ చల్లారు. అదే రాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న నరేష్, భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు. మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరిని చెట్టుకు కట్టేసారు.