Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు

0

తుగ్గలి
 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందుతున్నాయని సచివాలయాల కన్వీనర్ హనుమంతు,ఎంపీటీసీ రామాంజనమ్మ, సర్పంచ్ పుష్పవతి,సర్పంచ్ గౌరవ సలహాదారులు రవి లు తెలియజేశారు. బుధవారం మండల పరిధిలోని శభాష్ పురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలొ అధికారులు “జగనన్న ఆరోగ్య సురక్ష” పథకం కార్యక్రమాన్ని యంపిటిసి రామాంజనమ్మ,సర్పంచ్ పుష్పవతి లు ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మన గ్రామానికే ప్రత్యేక వైద్యులు వచ్చి, వైద్య సేవలు అందించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకం ను ప్రవేశపెట్టాడని,అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కర్నూలు నుండి విచ్చేసిన వైద్యులు జనరల్ సర్జన్ సంతోష్,జనరల్ మెడిసిన్ తన్వీర్ అహమ్మద్,ప్రాంతీయ వైద్యులు హరిత, మెహనాజ్ పాషా,కంటివైద్య నిపుణులు హనుమంతు రెడ్డి,డిపియంఓ మరియాదాస్ లు శిబిరానికి విచ్చేసిన వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు.104, వైద్యసిబ్బంది రోగులకు మందులు పంపిణీ చేశారు.ఐసీడియస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది పౌష్టిక ఆహార స్టాల్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కార్తీక్ రంగనాథ్, యంపిహెచ్ఈఓ బంధయ్య,యంపిహెచ్యస్ గోవిందరాజు,వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది,వైసిపి నాయకులు గోపాల్,ఫీల్డ్ అసిస్టెంట్ సందీప్,గ్రామ ప్రజలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie