హైదరాబాద్
ఇందిరాపార్క్ వద్ద జర్నలిస్టులు చేస్తున్న మహా ధర్నాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్ఇ వైఎస్ షర్మిల పాల్గోని మద్దతు తెలిపారు. షర్మిల మాట్లాడుతూ పోలీసుల చేత నా మీద ఒక కేసు పెట్టించారు. టీఎస్పిఎస్సీ పేపర్ లీకుల విషయంలో మేము కేసీఆర్ ను తప్పు పడితే కేసు పెట్టారు. టీఎస్పిఎస్సీ లో ఐటి శాఖ ను విమర్శ చేశామని కేసు పెట్టారు. మాకు కేసులు కొత్తేం కాదు. నన్ను ఒక రోజు జైల్లో కూడా పెట్టారు. కేసీఅర్ ఒక నియంత. .దేనికి భయపడం. జర్నలిజం కి నా సలాం. జర్నలిస్టులకు సలామ్. ప్రజలకు,ప్రతిపక్షాలకు గొంతు మీరు. జర్నలిస్ట్ అనే వాళ్లు లేకుంటే సమస్యలు బయటకు రావు. 9 ఎండ్ల బంగారు తెలంగాణలో జర్నలిస్టులు ఆందోళన చేయడం బాధాకరం. జర్నలిస్టులు సన్మానం చేయమని అడగలేదు. కేవలం మీకు రావాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని అన్నారు.
కేసీఅర్ జర్నలిస్టులను విస్మరించడం అన్యాయం. వైఎస్సార్ హయాంలో జర్నలిస్టులకు ఎంతో న్యాయం జరిగింది. వైఎస్సార్ హయంలోనే 70 ఎకరాలు జవహర్ లాల్ హౌజింగ్ సొసైటీకి కేటాయించారు. అది కాస్త కేసుల్లో ఇరుక్కుంది. వైఎస్సార్ మరణం తర్వాత ..అప్పుడున్న కాంగ్రెస్ కానీ..ఇప్పుడు కేసీఅర్ కానీ పట్టించుకోలేదు. వైఎస్సార్ హయాంలో జిల్లాల్లో కలెక్టర్ల చేత ఎంతో మందికి ప్రభుత్వ స్థలాలు ఇప్పించారు. విద్య వైద్యంలో పెద్ద పీట వైఎస్సార్ వేశారు. సీఎంఆర్ఎఫ్ నుంచి ఎంతో మంది జర్నలిస్టులకు ఆదుకున్నారు. వైఎస్సార్ ఎంతో చేస్తే కేసీఅర్ మాత్రం జర్నలిస్టులను మోసం చేశారు. సొసైటీలో భూముల కేసు సుప్రీం కోర్టులో గెలిచినా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి చిత్త శుద్ది లేదు. అందరికీ వరాలు ఇచ్చినట్లే.జర్నలిస్ట్ లను కేసీఅర్ మోసం చేశాడు. పైన పటారం..లోన లోటారం అని కేసీఅర్ చెప్పాడు. సైనికుల మాదిరిగా జర్నలిస్ట్ లను కేసీఅర్ పోల్చారు. ఇన్ని మాటలు చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వరంగల్ వెళ్లి అక్కడ కాలనీ కడుతం అని చెప్పారు.
హైదరాబాద్ జర్నలిస్టులు అసూయ పడేలా కాలనీ అన్నారు. క్లబ్ హౌజ్ లు అన్నాడు.. సినిమా హాల్స్ అన్నాడు..మార్కెట్ లు అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయి. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావు అని అందుకే ఇవ్వడం లేదు. కేసీఅర్ పాలనలో అసలు జర్నలిస్ట్ లకు కనీస మర్యాద కూడా లేదు. పాదయాత్రలో జర్నలిస్టుల కష్టాలను చూశాం. స్వేచ్చగా వార్తలు రాసే పరిస్థితి లేదని బాధ పడని జర్నలిస్ట్ లేడు. పాదయాత్ర లో నేను ఎమ్మెల్యే ల అవినీతి గురించి చెప్పిన ప్రతి నిజం నాకు జర్నలిస్టులు చెప్పినవే నని అన్నారు.