నిజామాబాద్
నిజమాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం లో చంద్రబాబు కి పెరుగుతున్న మద్దతు మొన్న బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే షకీల్, నిన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, శుక్రవారం బి.జే.పి పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి లు చంద్రబాబు నాయుడు అభిమాన సంఘాలు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపారు..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మద్దతు గా ఆయన అభిమాన సంఘాలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు మద్దతు పెరుగుతోంది..నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లో చేపట్టిన రిలే నిరాహారదీక్షకు నిన్న కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మద్దతు తెలుపగా నేడు బి.జె.పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడపాటి ప్రకాష్ రెడ్డి,మోహన్ రెడ్డి లు దీక్ష శిబిరం వద్ద సి.బి.ఎన్ ప్లకార్డులు చేతపట్టి మద్దతు తెలిపారు.
ఈ సందర్బంగా బి.జే.పి నాయకులు ప్రకాష్ రెడ్డి,మోహన్ రెడ్డి లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయి లో ద్వజమెత్తారు..చంద్రబాబు నాయుడు విజినరి లీడర్ అని అలాంటి వ్యక్తి ఆలోచనల వల్ల లక్షలాది మంది ఐ.టి ఉద్యోగాలు పొందరాని అన్నారు..ఆధారాలు లేకుండా కనీసం ఎఫ్.ఐ.ఆర్ లో పేరు లేకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తిని కేవలం రాజకీయ కక్ష్య తోనే అరెస్టు చేసారని మండి పడ్డారు.. రాబొయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టి.డి.పి పార్టీ దే విజయం అని అన్నారు….