Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ నేత ఇంటిపై వైకాపా దాడి

0

పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నాయకుడి ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పలాస పట్టణానికి చెందిన యవ్వారి మోహనరావు.. చంద్రబాబు అరెస్టుపై జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. దీన్ని జీర్ణించుకోలేక సుమారు 40మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ నిలుపుదల చేసి మోహనరావు ఇంటిపై దాడికి దిగారు.

అరగంట పాటు అక్కడే వీరంగం సృష్టించారు. భీతిల్లిన మోహనరావు కుటుంబ సభ్యులు తలుపులు వేసుకుని ఉండిపోయారు. అనంతరం వైసీపీ శ్రేణులు ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశాయి. వారు వెళ్లిపోయిన తర్వాత మోహనరావు బయటకు వచ్చి టీడీపీ నాయకులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. అనంతరం వారు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie