టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు అరెస్ట్
నాగర్ కర్నూల్
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో జరుగుతున్న అవతకతలను,పనులు ఇంకా పూర్తి కాకపోయినా ఎన్నికల కోసం కెసిఆర్ ప్రాజెక్టు ను అట్టహాసంగా ప్రారంభించడానికి సాక్షదారులతో సహా నిరూపించడానికి ఈ రోజు ప్రాజెక్ట్ సందర్శనకు పిలుపునిచ్చిన కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు శ్రీ చింతలపల్లి జగదీశ్వర్ రావు ని నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి పోలీస్ లు అరెస్ట్ చేసి తాడూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డుగా పెట్టుకొని ప్రభుత్వ అవినీతి గురించి ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతున్నారని,ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పనులు పూర్తి చేయకుండా ఓట్ల కోసం ప్రజలను మభ్య పెడుతున్నారని వారు అన్నారు.ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు ప్రాజెక్టు ప్రారంభం అయితే మాకు నష్టపరిహారం చెల్లించేది ఎవ్వరని ఆవేదన చెందుతున్నారని తెలియజేశారు._ప్రాజెక్ట్ నిర్మాణం పనులు పూర్తి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తే అనుమతించకుండా ఎందుకు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.