Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తప్పిన పెను ప్రమాదం జీహెచ్ఎంసి, విద్యుత్ శాఖల నిర్లక్ష్యంతో రెండు మేకలు బాలి అక్కడే వినాయక నిమజ్జనం కార్యక్రమం…అదే సమయంలో అక్కడే ఉన్న చిన్నారులు, స్థానిక ప్రజలు వెంటనే అలెర్ట్ కావడంతో తప్పిన ప్రమాదం

0

హైదరాబాద్

మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పర్ బస్తి హనుమాన్ దేవాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలుమార్లు జీహెచ్ఎంసి c, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని హనుమాన్ దేవాలయ ప్రతినిధి నిరంజన్ యాదవ్ తెలిపారు. దేవాలయం వద్ద చెత్తకుండి తొలగించాలని జీహెచ్ఎంసి కి పలుమార్లు ఫిర్యాదులు చేసి పట్టించుకోవడం లేదు. చావని ఎం ఐ ఎం పార్టీకి చెందిన కార్పొరేటర్ దీనికి ప్రధాన అడ్డంకిగా మారారు. గతంలో ఇక్కడే రెండు పశువులు కూడా చనిపోయాయి. కానీ జీహెచ్ఎంసి , విద్యుత్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకవేళ వినాయక నిర్వహకులు అలెర్ట్ లేకపోతే తీవ్ర ప్రాణ నష్టం జరిగేదని వాపోయారు. చెత్త కుండి తొలగించకపోతే  త్వరలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఈ సందర్బంగా హెచ్చరించారు..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie