Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణలో 9,810 మంది లైసెన్సడ్ గన్ లు

0

హైదరాబాద్, అక్టోబరు 11
తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 30న పోలింగ్ ఉండగా.. పోలింగ్‌కు ముందు ఒక రోజు వరకు ప్రచార పర్వం సాగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎవరి వారు తమ తమ షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటున్నారు.నేతల ప్లాన్స్ ఇలా ఉంటే.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ రక్షణ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బులు, బంగారం, ఇతర గిఫ్ట్స్‌ల రవాణాను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా. ముందస్తుగా లైసెన్స్‌డ్ గన్స్‌ను సరెండర్ చేయాలని సదరు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు సీపీ సీవీ ఆనంద్.నేతల ప్లాన్స్ ఇలా ఉంటే.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ రక్షణ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బులు, బంగారం, ఇతర గిఫ్ట్స్‌ల రవాణాను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.

సైదాబాద్ హనుమాన్ దేవాలయం కూల్చివేతే పై ఉద్రిక్తత.. ఆర్డీవో వ్యవహార శైలిపై భక్తులు తీవ్ర ఆగ్రహం..

ముందస్తుగా లైసెన్స్‌డ్ గన్స్‌ను సరెండర్ చేయాలని సదరు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు సీపీ సీవీ ఆనంద్.ఇదిలాఉంటే.. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో లైసెన్స్‌డ్ గన్స్ వ్యవహారం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 9,810 మంది అధికారికంగా గన్స్‌ కలిగి ఉన్నారు. ఈ లెక్కలల్లో రాష్ట్రాల జాబితాలో టాప్‌లో ఉత్తరప్రదేశ్‌ ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో లైసెన్స్‌డ్ గన్స్ కలిగిన వారి సంఖ్య చాలా తక్కువగా. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక – 1,20,719 లైసెన్స్‌లతో అగ్రస్థానం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు – 24,237, కేరళ – 11,330, తెలంగాణ – 9,810, ఆంధ్రప్రదేశ్‌ – 7,007 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణలో లెక్కలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోప్రస్తుతం లైసెన్స్‌డ్ గన్స్ కలిగి ఉన్నవారి సంఖ్య 9,810 ఉంది. 2018 ఎన్నికల సమయంలో 9,070 మంది గన్ లైసెన్స్ కలిగి ఉండగా.. ఈ ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 740 మందికి లైసెన్స్ జారీ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ లెక్కలు చెబుతున్నాయి. లైసెన్స్ గన్ కలిగి ఉన్న వారిలో ఎక్కువగా.. భద్రతా సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు. హైదరాబాద్‌లోని 3 పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోనే 5 వేలకుపైగా గన్‌ లైసెన్స్‌లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, పాతబస్తీలో ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie