Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలి : వైఎస్ షర్మిల రెడ్డి

0

హైదరాబాద్
ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శించారు. నాడు పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పుడు,  టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని చెప్పి,
ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్టే కదా?  ఉద్యోగాలు ఇవ్వండని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పలకలేదు గాని. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నాడు.  బోర్డు పారదర్శకంగా నడుస్తుందని ప్రకటించింది మీరే.  పరీక్షల నిర్వహణలో లోపాలు జరగలేదన్నది మీరే. ఇప్పుడు తప్పు జరిగిందని సర్వీస్ కమిషన్ ప్రక్షాళన అంటున్నది మీరే.  ఇన్ని డ్రామాలన్ని ఎందుకు దొర? ఓట్ల కోసమే కదా అని నిలదీసారు.  ఇన్ని రోజులు టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు నిజం.  మీరు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారన్నదే వాస్తవం. ఏళ్ల తరబడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి  ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారు.
ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని తెలంగాణ బిడ్డలకు క్షమాపణలు చెప్పండి.  నిరుద్యోగుల బలిదానాల మీద అధికార పీఠం ఎక్కి నిరుద్యోగులనే నిండా ముంచిన  దుర్మార్గులు మీరు.  ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మీరు చేసిన మోసాలు చాలు. ఈ నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుంది. తెలంగాణ చరిత్రలో నిరుద్యోగ ద్రోహులుగా నిలిచిపోతారు మీరని ఆమె మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie