Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

దాండియాలో అప్రమత్తంగా వుండండి ఎమ్మెల్యే రాజా సింగ్

0

హైదరాబాద్

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాల ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమం హిందువులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఎంతో భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమంలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని, ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో అసభ్య కార్యక్రమలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని  తెలిపారు. ఈ క్రమంలో దాండియా ఏర్పాటు చేసే నిర్వాహకులు లోపలికి అనుమతించే ముందు తప్పకుండా ఆధార్ కార్డు అందరిదీ పరిశీలించాలని, ఇతర మతానికి చెందిన ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దని ఆయన హెచ్చరిక జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie