Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

 దుమ్ము దూలితో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

0

దుంబ్రిగుడ
ఎన్ హెచ్ 516 హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా మండలంలో రోడ్డు పనులు చేపడుతుండడంతో దుమ్ము దూళితో వాహనదారులు  ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణం చేపట్టేటప్పుడు దుమ్ము దూళి ఏర్పడకుండా రోజువారిగా రోడ్డుపై నీళ్లను తడపాల్సి ఉంది. కానీ ఆ విధంగా చేపట్టకపోవడంతో నిత్యం వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక మండల కేంద్రంతోపాటు అరకు సంత బయలు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపడుతున్నారు. కొన్నిచోట్ల నిర్మాణం పూర్తికాగా మండల కేంద్రం తో పాటు కురిడి, అరకు సంత బయలులో, మండల కేంద్రం నుంచి కించమండ వరకు ప్రస్తుతం నిర్మాణం పనులు చేపడుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో రోడ్లపై  దుమ్ముధూళి ఏర్పడలేదు ఏర్పడలేదు. అయితే ప్రస్తుతం గత వారం రోజుల నుంచి ఎండలు కాస్తుండడంతో వాహన రాకపోకలతో రోడ్డుపై దుమ్ము దులి ఎగసిపడుతుంది. ప్రధానంగా స్థానిక మండల కేంద్రంలో రోడ్డుపై వాహనాలు రద్దీగా నడుస్తుండడంతో విపరీతంగా దుమ్ము ధూళి ఏర్పడుతుంది. మండల కేంద్రం కావడంతో  వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు జనాలు ఎక్కువగా వస్తున్నారు. వీరంతా దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం వాసులైతే నిత్యం దుమ్ముధూళితో ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల శ్వాస కోస వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోజువారీగా రోడ్డుపై నీళ్లు తడిపే విధంగా చర్యలు తీసుకోవాలని మండల వాసులతోపాటు వాహనదారులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie