నిర్మాణ కూలీలుగా మారిన విద్యార్దులు చర్ల గౌరారం ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్వాకం
నల్గోండ
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని చర్లగౌరారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాద్యాయుల నిర్వాకం బయట పడింది. పలకా బలపం పట్టించాల్సిన చిట్టి చేతులతో ఏకంగా ఇటుకలు మోయించారు సదరు ఉపాద్యాయులు.
విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సింది పోయి, వారిని కూలీలుగా మార్చారు. కాసులకు కక్కుర్తి పడి చిన్నారులను బానిసలను చేశారు. మానవత్వం మరిచి, సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి వచ్చిన ఇటుకలను మోయడానికి.. కేవలం 500 రూపాయల ఖర్చు చేస్తే కూలీలు దొరికే వారు. ఆ డబ్బు మిగిలించు కోవడం కోసం.. ఏకంగా విద్యార్థులనే కూలీలుగా మార్చారు ప్రభుత్వ ఉపాద్యాయులు. ఎంతగానో కలచి వేస్తున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పేరెంట్స్ నుంచి వినబడుతుంది. కలచి వేస్తున్న ఘటనను బాలల హక్కుల సంఘాలు, పేరెంట్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు.