Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నెల్లూరులో  మొబైల్ హంట్ సక్సెస్

0

నెల్లూరు, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్)
నెల్లూరు పోలీసులు మొబైల్ హంట్ లో సక్సెస్ అయ్యారు. ఏకంగా 1246 సెల్ ఫోన్లను వెదికి పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు 3కోట్ల 10 లక్షల రూపాయలు కావడం విశేషం. నాలుగు విడతల్లో భారీగా సెల్ ఫోన్లను పట్టుకుని బాధితులకు వాటిని అందజేశారు. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే గతంలో వాటిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. దొంగతనం చేసినవారు ఎంచక్కా సిమ్ మార్చేసి, ఐఎంఈఐ నెంబర్ మార్చేసి వాటిని వాడుకునేవారు. పోలీసులకు కూడా వాటిని వెదికి పట్టుకోవడం అంత సులభమయ్యేది కాదు. కానీ మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు పోయిన సెల్ ఫోన్లు వెదికి పట్టుకోవడం సులభం అయింది. అందుకే పోలీసులు ఇలాంటి కేసుల్ని ఇట్టే పరిష్కరిస్తున్నారు. వేల సంఖ్యలో సెల్ ఫోన్లు రికవరీ చేస్తున్నారు. నెల్లూరు పోలీసులు మొబైల్ హంట్ పేరుతో పోయిన సెల్ ఫోన్లను వెదికి పట్టుకుని బాధితులకు అప్పగించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ మలయప్ప

మొత్తం నాలుగు విడత్లలో సుమారు 3.10 కోట్ల విలువైన 1246 సెల్ ఫోన్ లను భాధతులకు అందజేశారు. నాలుగో విడతలో 602 ఫోన్లను వెదికి పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు కోటిన్నర రూపాయలు. విలువైన సెల్ ఫోన్లను పోగొట్టుకుని దిగాలుపడ్డ బాధితులు, తిరిగి వాటిని చూడగానే ఆశ్చర్యపోయారు, నెల్లూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ ఫోన్ పోతే బాధితులు వెంటనే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన CEIR పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా మొబైల్ 9154305600 కు వాట్సర్ ద్వారా మెసేజ్ పంపాలి. ఇలా  చేస్తే ఎఫ్ఐఆర్ లేకపోయినా ఆ ఫోన్ వెదికి పట్టుకుంటారు పోలీసులు. గతంలో చైన్ స్నాచింగ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చైన్ స్నాచింగ్ తో పాటు, మొబైల్ తెఫ్ట్ కేసులు కూడా బాగా ఎక్కువయ్యాయి. ప్రయాణ సమయంలో ముఖ్యంగా మొబైల్ ఫోన్లను తస్కరిస్తూ ఈజీమనీకి అలవాటు పడ్డారు కొందరు. సెల్ ఫోన్లను తక్కువరేటుకి ఈజీగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మేయొచ్చు. అందుకే ఇలా మొబైల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. మొబైల్ పోగొట్టుకున్నవారు మాత్రం ఏం చేయాలో తెలియక దిగాలుపడుతున్నారు.

పుడమి తల్లికి తూట్లు అడుగంటుతున్న భూగర్భ జలాలు – అక్రమంగా రాత్రిపూట బోర్ల తవ్వకాలు

ఫోన్ పోగొట్టుకుంటే మరొకటి కొనుక్కోవచ్చు కానీ, అందులో విలువైన సమాచారం మిస్ అయితే మళ్లీ రికవరీ చేసుకోవడం కష్టం. అది దుర్మార్గుల చేతిలో పడితే, పర్సనల్ వ్యవహారాలన్నీ బట్టబయలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ తో పాటు, వ్యక్తిగత  వివరాలు పోగొట్టుకున్నవారు ఇబ్బంది పడుతుంటారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందించిన పోలీసులు.. సెకండ్ హ్యాండ్ ఫోన్లపై కీలక సూచనలు చేశారు. చౌకగా వస్తున్నాయని సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఎవరూ కొనద్దని సూచించారు. అలా కొంటే తిరిగి వాటి విషయంలో ఎదురయ్యే సమస్యలకు వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తాజాగా నెల్లూరు జిల్లా పోలీసులు ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అందించారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 602 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో శ్రమించిన సైబర్ క్రైమ్ అనాలిసిస్ బృిందాన్ని ఎస్పీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie