Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

న్యూ జెర్సీలో అక్షర ధామ్ ప్రారంభం

0

వాషింగ్టన్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్)
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో అక్టోబర్‌ 8వ తేదీన ప్రారంభం కానుంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం రాబిన్స్‌విల్లె పట్టణంలో నిర్మించిన బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు సెప్టెంబర్ 30 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్షరధామ్ మహామందిర్ ప్రారంభ వేడుకలు భారతీయతను ప్రదర్శిస్తాయి. నిర్మాణ నైపుణ్యం, మన అద్భుతమైన ప్రాచీన సంస్కృతి, నీతి.. దీని ప్రారంభోత్సవంతో మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రయత్నం శుభప్రదం.. BAPS స్వామినారాయణ సంస్థ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు.. అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.సెప్టెంబరు 2023లో భారత్ వేదికగా జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

బిసీ, బడుగుల రాజ్యాధికారమే నా ధ్యేయం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్​ ముదిరాజ్​

న్యూఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ కు హాజరైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్.. అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. “ఈ ఆలయ సౌందర్యం, దాని విశ్వవ్యాప్త శాంతి సందేశం చూసి మేము ఆశ్చర్యపోయాము.. సామరస్యం, మంచి మానవుడిగా మారేందుకు ఇది మంచి ప్రార్థనా స్థలం మాత్రమే కాదు.. చరిత్రకు మైలురాయి.. భారతదేశ విలువలు, సంస్కృతి, ప్రపంచానికి అందించిన సేవలను కూడా చూపిస్తుంది..’’ అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా BAPS ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ నుంచి ప్రధాన మంత్రి రిషి సునక్ ఆశీస్సులు పొందారు. అంతేకాకుండా, యూఎస్ లో పవిత్రమైన మరో అందమైన స్వామినారాయణ అక్షరధామ్ ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా రిషి సునాక్.. బాప్స్ సంస్థ, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబిన్స్‌విల్లేలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అక్షరధామ్ ప్రతిష్టాపన వేడుక ప్రారంభమైంది.స్వామినారాయణ్ అక్షరధామ్‌‌ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నిర్మితమైంది.

థేమ్స్‌ నదిపై టవర్‌ బ్రిడ్జ్‌లో సాంకేతిక సమస్య పైకిలేచిన వంతెన కిందకురాలేదు..

ఈ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన వేడుకలు 9 రోజులపాటు పవిత్ర మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అమెరికాలో అక్షర్‌ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాధినేతలతోపాటు.. నలువైపుల నుంచి ప్రముఖులు బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ట్రస్టుకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు.. మద్దతును అందిస్తున్నారు.12 సంవత్సరాలకు పైగా దీనిని నిర్మించారు. 12,500 మంది వాలంటీర్లు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఉత్తర అమెరికా అంతటా ఈ రాతి మహామందిర్ అక్షరధామ్‌ కేంద్రబిందువుగా మారనుంది. అద్భుతమైన నైపుణ్యాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించిన ఈ ఆలయంలో కళాత్మకతను కూడా మిళితం చేస్తుంది. ఆధ్యాత్మికత, సామరస్యం, శాంతికి దీటుగా ఈ అక్షరధామ్ ప్రపంచ ఆకర్షణగా నిలిచిపోనుంది

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie