Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పద్మావతిపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష…

0

తిరుపతి

ప్రజలందరిని ఆరోగ్యవంతులుగా చేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని పద్మావతి పురం సర్పంచ్ గరికపాటి జ్యోతి స్పష్టం చేశారు.
 రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం తిరుపతి రూరల్ పద్మావతి పురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మావతి పురం గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రజలకు ఉచిత వైద్య పరీక్షల నిర్వహించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచిత మందులతో పాటు అవసరమైన వారికి చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ పరిధిలో గల ఆసుపత్రులకు సూచించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు చిన్న పిల్లల వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు పాల్గొని తమ సేవలను అందించారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఎనిమిది వందల మందికి పైగా సేవలను ఉపయోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అరుణ సులోచన, పద్మావతి పురం సర్పంచ్ గరికపాటి జ్యోతి మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఆరోగ్యం వంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపులో నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ ఈ మెడికల్ క్యాంపులను ఉపయోగించుకొవాలనీ కోరారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతగానో తోడ్పడ్డారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎన్. రాజ్యలక్ష్మి పంచాయతీ సెక్రటరీలు శివశంకర్ రాజు, నీనా కుమారి, ఏఎన్ఎం మేనక, ఎం ఎన్ హెచ్ పి మానస ,ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie